కరోనా వ్యాధి పట్ల అవగాహనా

Published: Tuesday April 20, 2021
పరిగి ఏప్రిల్ 19 ప్రజాపాలన : పరిగి నియోజక వర్గం  దోమ మండలంలో కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది.కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది.అంతే కాక ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక విధాల ప్రయత్నాలు చేపడుతోంది.దానితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 68,69 జీవోలను చాలా కఠినంగా అమలు చేసేలా చూస్తోంది.69 జీఓ ప్రకారం కరోనా విజృంభిస్తున్న వేళ ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించాదని ఆదేశాలు జారీ చేసింది. అయితే వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో అధికారులు వీటిని పెడ చెవిన పెడుతున్నారు. తద్వారా వీరి వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే మండల కేంద్రంలోని ఐకెపి అధ్వర్యంలో జీవో నం 69 ను ఉల్లంగించి వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసమై నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి దోమ, కుల్కచర్ల మండలాల నుండి సుమారు 60 మంది వరకు సభ్యులు హాజరయ్యారు. అయితే ఇలా సమావేశాలు నిర్వహించడంతో పలువురు ఆదేశాలు సామన్యులకేనా అధికారులకు పట్టవా అని విమర్శిస్తున్నారు.