రైతుల పక్షాన ఉంటా మాస్టర్ ప్లాన్ రద్దుకు నాది భరోసా.. --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్.

Published: Wednesday January 18, 2023

జగిత్యాల, జనవరి, 16 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ శంకుల పల్లి, మోతే, నరసింగాపూర్ గ్రామ ప్రజా ప్రతినిదులు, నాయకులు, రైతులు, మహిళలు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని కలిసి మాస్టర్ ప్లాన్ లో భాగంగా వ్యవసాయ భూములను వ్యాపార, రీక్రియేషన్ మరియు ఇతర జోన్ ల నుండి తొలగించాలని వాటిని యదా విధిగా కొనసాగించాలని వినతి పత్రాన్ని అందజేయగా  సానుకూలంగా స్పందించిన ఎమ్మేల్యే రైతుల భూములను జోన్ ల నుండి తొలగిస్తామని, మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.