ఏపీ ఇసుక తెలంగాణ బాట - ఒక్క రాత్రికి ఎన్ని లారీలు సరిహద్దు దాటుతున్నాయో తెలుసా ?

Published: Friday December 30, 2022
కొంతమంది లారీ యజమానులు గస్తీగా ఏర్పడి పగలు,రాత్రి సమయంలో నెంబర్లు లేని కార్లలో కాపలా కాస్తూ ఇసుక లారీలను గమ్యస్థానం చేర్చుటకు ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం తెలంగాణకు ఇసుక లారీలు తరలించే క్రమంలో లోకల్ వ్యక్తులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారితో చేతులు కలుపుకొని ఫోను ద్వారా సమాచారం ఇస్తూ ప్రతి రోజు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులతో ఇసుక మాఫియా దారులకు సంబంధం లేకుండా అక్రమంగా ఇసుకను ఆంధ్ర నుండి తెలంగాణకు తరలిస్తారు. ప్రతిరోజు 20 నుండి 30 లారీల ద్వారా ఇసుక రవాణా ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా కొనసాగుతుంది.
అక్రమ ఇసుక తరలిస్తున్న లారీలను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నడం శోచనీయం. ఆంధ్ర నుండి తెలంగాణకు తరలిస్తున్న ఇసుకను పకడ్బందీగా నిరంతరం తనిఖీ చేస్తే అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్టపడే అవకాశం ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు కొందరు బహిరంగంగానే చెబుతున్నారు.కాని ఇంత అక్రమంగా అనుమతి లేకుండా ఇసుక మాఫియా బకాసుర్లు ఇసుకను రాష్ట్రం దాటిస్తుంటే మండలంలో ఉన్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టలేని పక్షంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగడంతో అధిక లోడ్ వల్ల రోడ్లు దెబ్బతిని ప్రమాదాలకు నిలయంగా మారి ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు ఆంధ్ర నుంచి తెలంగాణకు తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.