ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ *

Published: Friday November 04, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 03 (ప్రజాపాలన,ప్రతినిధి) :  జిల్లాలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లా అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్  కమిటీ సభ్యులతో గత సంవత్సరం నుండి ఈ సమావేశం వరకు కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 229 కేసులు నమోదు కాగా, 200 మంది బాధితులకు  కొంత పరిహారం అందించడం జరిగిందని, ఎఫ్,ఐ,ఆర్  నమోదు కాగానే 25 శాతం పరిహారం అందించడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటివరకు రూ కోటి పది లక్షల పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. నూతన చెల్లింపుల విధానం ఎస్,ఎన్,ఎ, (సింగల్ నోడల్ అకౌంట్) ద్వారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితుల ఖాతాలలో నీరుగా నగదుద్యమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ హక్కులపై  ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 30వ తేదీన జిల్లాలోని ప్రతి మండలంలో పౌర హక్కుల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హక్కుల గురించి తెలిసేలా వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సురేష్, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, మణెమ్మ, సావిత్రి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కేశవరావు, వెంకట్,గోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.