ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి *కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించి, పరిశ్రమల యాజ

Published: Thursday March 02, 2023

వివిధ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ మరియు బోనస్ లను  అమలయ్యే విధంగా చూడాలని, వలస కార్మికుల చట్టం 1970 ని అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నం ఏ.ఎల్.ఓ (అసిస్టెంట్ లేబర్ కార్యాలయం) ముందు ధర్నా నిర్వహించి స్థానిక ఏ.ఎల్.ఓ ఆంజనేయులు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వివిధ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు స్థానిక యాజమాన్యాలు  చట్టపరమైన హక్కులను కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని, కార్మిక శాఖ ఆదేశాలను కూడా తుంగలో తొక్కి కార్మికులను శ్రమ దోపిడీ గురి చేస్తున్నారని మండిపడ్డారు అనేక పరిశ్రమల్లో కార్మికుల చేత 12 గంటలు పని చేయించుకుంటూ ఉత్పత్తిని పోగుచేసుకొని యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నారు తప్పితే కార్మికుల సంక్షేమం గానీ, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా కార్మికుల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వలస కార్మికుల చట్టం 1979 ప్రకారం ఏ సంస్థలైనా 12 నెలల కాలంలో ఐదు మంది కన్నా ఎక్కువ మంది కార్మికులు ఉంటే ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలి యాజమాన్యం గాని కాంట్రాక్టర్ గాని ప్రతి కార్మికునికి పాస్ బుక్ ఇవ్వాలి, ఈ పాస్ బుక్ లో పరిశ్రమ అడ్రస్ ఎన్ని రోజులు పని ఉంటుంది, జీతం యొక్క వివరాలను పొందుపరచాలి, వలస కార్మికుడు తమ స్వగ్రామం నుండి వచ్చేటప్పుడు డిస్ ప్లేస్మెంట్ అలవెన్సులు ఇవ్వాలి, ఇట్టి వివరాలను కూడా పాస్ బుక్ లో ఉంచాలి, అదేవిధంగా కాంట్రాక్టు కాలం పూర్తి అయిన తర్వాత తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఎంత చెల్లిస్తున్నారు అనే వివరాలను కూడా ఈ పాస్ బుక్ లో పొందుపరచాలి కార్మికుల యొక్క జీతానికి సంబంధించిన వివరాలను కూడా పాస్ బుక్ లో పొందుపరచాలి కానీ వలస కార్మికులకు ఎలాంటి చట్టబద్రత లేకుండా వారితో విపరీతమైన శ్రమ చేయిస్తున్నారని యాజమాన్యాలపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు కనీస వేతనాల పట్ల ఈఎస్ఐ ఈపీఎఫ్ గ్రాడ్యుటీ బోనస్ తదితర కార్మిక చట్టాలను అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా కోశాధికారి జి కవిత, జిల్లా సహాయ కార్యదర్శి దిబ్య ప్రతాప్, సిఐటియు నాయకులు బి.యాదగిరి, పోచమని కృష్ణ, శివ ప్రసాద్ గౌడ్ శేఖర్ రెడ్డి శంకర్ మనోహర్ చిన్న అజయ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.