బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. రామకృష్ణాపూర్ , నవంబర్ 8. ప్రజాపాలన.

Published: Wednesday November 09, 2022

 

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వ విప్  చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్  బాసటగా నిలుస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ లొ గల గంగ కాలనీ కి చెందిన సీనియర్ స్టాఫ్ కెమెరామెన్ సారయ్య. కుమార్తె ఖ్యాతి. నీట్ లో మంచి ర్యాంకు సాధించి ప్రతిమ వైద్య కళాశాలలో. ఎం. బి. బి. ఎస్. సీట్ సాధించింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని ఖ్యాతి ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే బాల్క సుమన్  లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థిని ఖ్యాతిని ఆశీర్వదించారు. కష్టకాలంలో తమకి అండగా నిలిచిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు.
ఇప్పటికే రెండు రోజుల క్రితం కోటపల్లి మండలం, అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా నీట్ లో మంచి ర్యాంకు సాధించి మహబూబ్ నగర్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన రవీనా హాస్టల్ యూనివర్సిటీ ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన విషయం అందరికీ విధితమే.పేద విద్యార్థినిలు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించి వారిలో  సేవాగుణాన్ని కలిగిన బాల్క సుమన్ను నియోజకవర్గ ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.