అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Published: Thursday May 13, 2021

బెల్లంపల్లి, మే 13, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి ఐసొలేశన్ కేంద్రానికి వస్తున్నా కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని పెంచాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. గురువారం నాడు స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రంలో సింగరేణి అధికారులు మరియు వైద్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ అసోలేషన్ కేంద్రానికి వస్తున్న కరోనా పాజిటివ్ రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించాలని అలాగే కరోనా వ్యాధి అంటే భయపడకుండా తగిన విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలోని సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తానని, విధులకు హాజరవుతున్న సింగరేణి కార్మికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షులు వెంకట్రావుతో కలిసి ప్రభుత్వ దృష్టికి మరియు సింగరేణి యాజమాన్యంతో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కార్మికుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ కు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా అత్యవసరం అని భావిస్తే బయటకు రావాలని ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని  తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలని ఎప్పటికప్పుడు శానిటైజే షన్తో శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తెరాస నాయకులు భీమా గౌడ్, కొమ్మెర లక్ష్మణ్, టీబీజీకేఎస్ నాయకులు చెవిటి సుదర్శన్, సోకాల శ్రీనివాస్, ఏరియా ఆస్పత్రి ఫిట్ సెక్రెటరీ అనుముల సత్యనారాయణ, సింగరేణి అధికారులు, ఆసుపత్రి డాక్టర్లు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ అనిల్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.