ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *సింగారం తాటిపర్తి కుర్మిద్ద నంది వనపర

Published: Friday September 30, 2022
ఈరోజు సింగారం గ్రామంలో పాదయాత్ర జయ ప్రదం చేయాలనీ రక్షిత కౌలుదారు ల తోమీటింగ్ జరిగింది ఈ సందర్భంగా  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  మాట్లాడుతూ స్వాతంత్ర్యం  రాకముందు నుండి  మిగులు భూములు సాగుచేస్తున్నారు 1950 సంవత్సరంలో   భూ చట్టం వచ్చింది .37ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.38 ఈ సర్టిపిక్ ట్ ఇవ్వకుండా 1953 సంవత్సరములు లో దొంగ పత్రాలు సృష్టించి  రైతులను మోసం చేసింది  ఓంకారేశ్వర దేవాలయానికి రాసిఇచ్చినారు . అప్పటినుండి సాగుచేస్తున్న పెదాలను రక్షిత కౌలుదారు గా నమోదు చేసి  భూ యజమానులు అండోమెంటు అధికారులు  సిస్తులు వసులు చేసి  పేదలను   తీవ్రమైన అన్యాయం చేసినారు. ఈ భూములు  రక్షిత కౌలుదారు లవి కాబట్టి  వెంటనే  పట్టాలు ఇవ్వాలని పాదయాత్ర చేపట్టాము  కాబట్టి   4 గ్రామాల వాళ్ళు  రేపు ఉదయం  9 గంటలకు  సింగారం  చేరుకోవాలి   10గంటలకు  పాదయాత్ర  ప్రారంభం  ఐతుంది ఈ కార్యక్రమం లో భూసాధన కమిటీ  కార్య దర్శి  రాజిరెడ్డి అధ్యక్షులు బి కృష్ణ  సంజీవ చెన్నారెడ్డి మహిళా సంఘం  మండల కార్యదర్శి మస్కు  అరుణ   మండల నాయకురాలు  పుష్ప నర్సింహా రాములు బుగ్గరాములు పరమేష్  శ్రీశైలం గోపాలు   మండల  సంతోష  నక్క పద్మ  మాదవి  అరుణమ్మ  ఎం భారతమ్మ  ఎస్ భారతమమ్మ తదితరులు పాల్గొన్నారు.