అళ్ళపాడులో ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Published: Friday January 07, 2022
బోనకల్, జనవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన ఆళ్లపాడు గ్రామంలో జరిగిన బ్యాంకు ఆవ్వగహన ఖాతాదారులు రైతుల రుణాలపై అవగాహన సదస్సు కల్పించి రైతుల కోసం నాబార్డ్ సహకారంతో ఏపీజీవీబీ స్కీముల పై కళాజాత ఏపీజీవీబీ కలకోట బ్రాంచ్ గల ఆళ్లపాడు గ్రామంలో రైతులతో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. పర్యవేక్షణలో కళాబృందం వారు విభూతి శ్రీనివాసరాజు, విభూతి రాజారామ్ బృందంచే కళాజాత ప్రదర్శనలు జరిగింది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మ్యాజిక్ షో మరియు పాటలు మాటలు హస్య లహారి తో బ్యాంకింగ్ యొక్క పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ బ్యాంకింగ్, నగదు రహిత లావాదేవీలు, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకాలు గురించి అవగాహన కల్పించారు. అనంతరం సభలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు గ్రామ రైతులకు బ్యాంకుల సేవలు వినియోగించే విధంగా బ్యాంకు సిబ్బంది రైతులకు సహకరించాలని రుణాలపై అవగాహన కల్పించాలని బ్యాంకు రుణమాఫీ ఇచ్చి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని రుణమాఫీ వచ్చిందనే నెపంతో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకుల వద్ద కు రాకుండా రైతులు రెన్యువల్ చేసుకోకుండా నష్టపోయారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని 2019లో నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు అయితే రైతులు వడ్డీ లు కట్టుకునే అవగాహన కల్పించి ఉంటే నష్టపోయి ఉండేవారు కాదని ఆయన తెలియజేశారు. బ్యాంకు రుణ మాపి రానప్పటికీ రైతులు అపోహలు చెందినారని గుర్తు చేశారు బ్యాంకు వారిని ఇతర బకాయిపడ్డ మొండి బాకాయి లు సెటిల్మెంట్ రుణాలు చేయించి గ్రామ రైతులకు లబ్ధి చేకూర్చాలని ఆయన కోరారు . ఆలాగే కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారికి రుణాలు ఇవ్వాలని కొరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, బ్యాంకు మేనేజర్ బి ప్రదీప్ కుమార్, బ్యాంకు సిబ్బంది శ్రీనివాస రావు, వివో ఏ లు బ్యాంకు మిత్ర రైతులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.