మానసిక వికలాంగులకు స్టడీ మెటీరియల్ పంపిణీ మంచిర్యాల బ్యూరో, ఆగస్టు26, ప్రజాపాలన:

Published: Saturday August 27, 2022

అంతర్జాతీయ వాసవీక్లబ్ ఆదేశానుసారం బెల్లంపల్లి వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగులకు చదువుకునేందుకు వీలుగా ఉండేలా శుక్రవారం  స్టడీమెటీరియల్  అందజేశారు. వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్ ఆధ్వర్యం లో అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు రేణికుంట శ్రీనివాస్ నేతృత్వంలో బెల్లంపల్లి వాసవీక్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, దాత రీజియన్ ఛైర్మన్ పెద్ది రాజేందర్ లు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల సేవలను నిర్వహిస్తున్న వాసవీక్లబ్ రికార్డు స్థాయి లో అన్ని ప్రాంతాలలోని మానసిక వికలాంగులకు నహాయంగా ఉండాలనే లక్ష్యంగా వారిని విద్యావంతులను చేయాలనే ఉద్దేశ్యంతో మానసిక వికలాంగులు చదువుకునేందు వీలుగా ఉండే పుస్తకాలు, వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మానసికంగా బుద్ధి ఎదగని ఏడు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అక్షరాలు నేర్చుకునే స్థాయి నుండిచదువు. ఆడుతు పాడుతు నేర్చుకునే వీలు కల్పించే వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ బెల్లంపల్లి కోశాధికారి రాచర్ల నంతోష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి వంశీకృష్ణ, పాఠశాల నిర్వాహకులు సదానందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.