పీర్జాదిగూడలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవం

Published: Tuesday April 27, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో మేడిపల్లి పాత పోలిస్ స్టేషన్ భవనంలో సువిశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావారణంలో 30 పడకలతో ఏర్పాటు చేసిన  కోవిడ్ కేర్ సెంటర్ ను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లతో కలిసి కార్మిమిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే అనేక కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తుందని మరియు ప్రజలందరికి ఉచితంగా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. పీర్జాదిగుడ మున్సిపల్ కార్పోరేషన్లో ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ కేర్ సెంటర్ లోఆన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎవరికైనా అత్యవసర పరిస్తితి ఏర్పడితే మల్లారెడ్డి ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. అదేవిదంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ, వైద్యులు చెబుతున్న  నిభందనలు పాటించి కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని  కాపాడేందుకు ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మేయర్ జక్క వెంకట్ రెడ్డిని అందుకు సహకరించిన పాలకవర్గాన్ని అభినందించారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ సొంత నిదులతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ రాష్రంలో మొట్టమొదటిదని మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో కోవిడ్ నిర్దారణ అయినవారు హోం ఐసోలేషన్ ఉండడానికి వసతులు లేని వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పురుషులు, మహిళల కోసం ప్రత్యేక వార్డ్లు ఏర్పాటు చేసామని, ప్రతి రోజు ఉచితంగా అల్పాహారం మరియు  మద్యాహ్నం, సాయంత్రం పౌష్ఠికాహారం ఇవ్వడంతో పాటు యోగా, వ్యాయామం  మరియు అత్యవసమైన వారికోసం ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ బాదితులలో మనోస్తైర్యం నింపడంతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన పాలకవర్గానికి, కమీషనర్ కు మేయర్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, పార్టీ శ్రేణులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.