నిధులు దుర్వినియోగం చేసిన కార్యదర్శి ని సర్వీస్ నుంచి తొలిగింపు

Published: Tuesday October 25, 2022
నిధులు దుర్వినియోగం చేసిన కార్యదర్శి ని సర్వీస్ నుంచి తొలిగింపు.
 
 
పాలేరు అక్టోబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి
గతంలో రూ.31 లక్షల ఇంటి పన్నులు దుర్వినియోగం పై కేసు నమోదు. స్వాహ చేసిన నిధులు రికవరి చేసిన తరువాత సర్వీస్ నుంచి తొలిగింపు. నేలకొండపల్లి
 
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మేజర్ పంచాయతీ లో నిధుల దుర్వినియోగం కు పాల్పడ్డ పంచాయతీ పూర్వపు కార్యదర్శి రామ నరేష్ ను ఎట్టకేలకు సర్వీస్ నుంచి తొలిగించారు. గతంలో ఎంపీడీవో కె. జమలారెడ్డి ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడ నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మేజర్ పంచాయతీ గా పని చేసిన రామ నరేష్ 2019 నుంచి మేజర్ పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగారు. నేలకొండపల్లి పంచాయతీలో పని చేసిన కాలంలో ఇంటి పన్నులు ప్రజల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.31 లక్షలు పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా, దుర్వినియోగం కు పాల్పడ్డారు. ముర్వినియోగం విషయం తెలుసుకున్న మండల అధికారులు. గత నెలలో రామ నరేష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్,
 (పంచాయతీ విభాగం) ఆదేశాల మేరకు ఎంపీడీఓ కె. జమలారెడ్డి నేలకొండపల్లి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా, మండల అధికారులు అంతర్గత విచారణలో నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు కార్యదర్శి రామ నరేష్ మూడు పర్యాయాలు గా పంచాయతీలో స్వాహా చేసిన నిధులను జమ చేశారు. దుర్వినియోగం చేసిన నిధులు జమ చేసిన కొంత కాలం తరువాత రామ నరేష్ ను సర్వీస్ నుంచి తొలిగిస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. గత నెలలోనే సర్వీస్ నుంచి తొలిగించిన విషయం ను అధికారులు గోప్యంగా
ఉంచటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా సర్వీస్ నుంచి తొలిగించిన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుండంతో చర్చంశనీయంగా మారింది. ఈ విషయం పై జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ ను వివరణ కోరగా నేలకొండపల్లి పూర్వపు కార్యదర్శి,
రామ నరేష్ ను సర్వీస్ నుంచి తొలిగించినట్లు తెలిపారు.