వృద్దులను కులబహిస్కరించిన ముదిరాజ్ లు

Published: Thursday March 24, 2022
జన్నారం రూరల్, మార్చి 23, ప్రజాపాలన: మండల కేంద్రం పోన్కల్ గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులను ముదిరాజ్ కులం నుంచి కుల పెద్దలు బహిష్కరిం చారని ఐలవేని రవి ముదిరాజ్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం స్థానిక మీడియా ముందు గోడు వేళ్లువేసు కున్నాడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తలిదండ్రులను పోన్కల్ ముదిరాజ్ కులం పెద్దలు వేలువేయడం ద్వారా జన్నారం పోలిస్ స్టేషన్ పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎసిపి, సిఐ అదేశాలతో పోలీసులు రెండు మూడు సార్లు పోన్కల్ ముదిరాజ్ కులస్థులతో పిలిపించి మట్లాడారని ఐనా కులంలో కి పెద్దలు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు కులం అందరితో సమాజంలో వుండి ఒంటరిగా బతుకుతున్నారని, కులంలో కలిసి ఉండాలంటే మూడు లక్షల రూపాయల కట్టాలని కుల పెద్ద ఒకరు షరతులు పెట్టినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో అనగారికంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనుషులు దేవుని పెద్దమ్మతల్లి జాతర పోన్కల్ ముదిరాజ్ కులనికి దూరంగా పెట్టడంతో చూట్టూ ప్రక్కల వారు మమ్ములను హెలంగా చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి కైనా కుల పెద్దలు తమ పై దయ చూపాలని, అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.