దళితులను మోసం చేస్తున్న బిజెపి టిఆర్ఎస్ ఎస్సీ

Published: Tuesday November 22, 2022
సెల్ దారా బాలరాజు మధిర రూరల్ నవంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండలం ఆదివాారం రాత్రి  *మల్లారం* గ్రామంలో శాసనసభ్యులు మల్లు విక్రమార్క*ఆదేశాలతో ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు *గొల్లమందల బాలు* అధ్యక్షతన సమావేశం నిర్వహించడం అయినది. ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తూ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అన్నారు..
కేంద్రంలో నరేంద్ర మోడీ దళితులపై వివిధ రాష్ట్రాల్లో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సర్పంచల కి రావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు పంచాయతీ లకు ఇవ్వకుండా నిలిపివేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు...
 నియోజకవర్గం లో శ్యాసన సభ్యులు *మల్లు భట్టివిక్రమార్క* పార్టీ లకు అతీతంగా, చింతకాని మండలం,రొంపిమల్ల గ్రామాల్లో అర్హులైన దళితుల్ని గుర్తించి వారికి దళితబంధు పథకం అందచేశారు అన్నారు.బీజేపీ వాళ్ళు దాన్నికూడా రాజకీయం చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం అనటం హాస్యాస్పదంగా ఉంది..ఎమ్మెల్యే రాజీనామాతో అభివృద్ధి జరుగుతుంది అంటె ..ముందు మీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి  అక్కడున్న  దళితులందరికీ  దళిత బంధు  ఇప్పించి అభివృద్ధి చేసి చూపించండి అని అన్నారు.. బీజేపీ ఎమ్మెల్యే,ఎంపీ లు గెలిచిన ప్రాంతాల్లో అభివృద్ధి ఎం జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు..ఎమ్మెల్యే గా పోటీ చేసి 1000 ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ పార్టీ వారు రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది అన్నారు. ప్రాంతం అభివృద్ధి చెందటానికిశాసనసభ్యులు *మల్లు భట్టి విక్రమార్క*  కృషి ఎంతో ఉంది అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన దళితులను గుర్తించి వారిని అభివృద్ధి పథంలో తీసుకురావటమే *భట్టివిక్రమార్క* లక్ష్యం అన్నారు మొదటి విడతలో దళితబంధు రాని వారు నిరాశ చెందవద్దని అర్హులైన అందరిని గుర్తించి *భట్టి విక్రమార్క దళిత బంధు పధకం  దళితులందరికీ అందేలా చూస్తారు అని అన్నారు.ఈ సమావేశంలో. మధిర మండల అధ్యక్షులు   *సూరంశెట్టి కిషోర్*, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు *చావా వేణు*. కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి *కరివేద రాంబాబు* గ్రామ శాఖ అధ్యక్షులు. *కొంగర వెంకటేశ్వరరావు*. నియోజకవర్గ  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  *తూమాటి నవీన్ రెడ్డి*, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు  *దుంప వెంకటేశ్వర రెడ్డి*. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవికుమార్*. మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు*,  మండలనాయకులు  *నిడమనూరి వంశీ* మండల సేవాదళ్  అధ్యక్షులు *ఆదూరు శ్రీనివాస్*. ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు. *పుట్టా పుల్లారావు*,  ఎస్సీ సెల్ మండల కార్యవర్గ సభ్యులు  *గార కళ్యాణ్. తంబళ్ల ఏడుకొండలు*,  మల్లారం గ్రామ ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు  మురకపూడి వెంకటేశ్వర్లు. గొల్ల మందల చిరంజీవి. అరిగల రవి .దారెల్లి ప్రసాద్. దారెల్లి చంద్రయ్య. గొల్లమందల మాణిక్యం  అరిగెల సుజాత. తదితర మహిళలు   గ్రామ పెద్దలు పాల్గొన్నారు.