ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ శానిటైజర్ ను ఏర్పాటుచేసిన బెల్లంపల్లి సింగరేణి లైన్స్ క్లబ్

Published: Friday April 23, 2021

బెల్లంపల్లి ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధిపోలీస్ సిబ్బందికి, ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే ఫిర్యాదుదారులకోసం బయట నుండి స్టేషన్ లోకి రాగానే శానిటైజ్ చేసుకోవడాని కోసం ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ శానిటైజర్ యంత్రాన్ని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి సింగరేణి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్ది రాజేందర్ తెలిపారు. ప్రజల ఉపయోగార్ధం బెల్లంపల్లి లైన్స్ క్లబ్ సింగరేణి వారి ఆధ్వర్యంలో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ శానిటైజర్ యంత్రాన్ని వన్ టౌన్ ఎస్ ఎచ్ ఓ ముష్కే రాజుతో ప్రారంభింపజేశామని చేతులు మిషన్ కింద పెట్టగానే ఆటోమేటిక్ గా శానిటైజర్ వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు పెద్ధి రాజేందర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.