పబ్లిక్ స్కూల్లో గిరిజన బాలబాలికలకు ఆహ్వానం

Published: Friday February 25, 2022
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామంతాపూర్ లో 2022-23 సంవత్సరం నకు గాను ఒకటవ తరగతిలో ప్రవేశము కొరకు గిరిజన బాల బాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (లంబాడా -4, ఎరుకల /చెంచు -1, ఇతర గిరిజన తెగలు -1) మొత్తం -06. (బాలురు -03, బాలికలు -03). అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వాస్తవ్యులై  ఉండవలెను. అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 పట్టణ ప్రాంతాలలో రూ.2,00,000 లోపు ఉండవలెను. ఒక కుటుంబం  నుండి ఒక విద్యార్ధికి మాత్రమే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అవకాశం కల్పించబడును. దరఖాస్తులు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం గది నం :10, కలెక్టర్ కార్యాలయ ఆవరణ, వికారాబాద్ నందు తేది:25.02.2022 నుండి లభించును. పూర్తి చేసిన దరఖాస్తులను చివరి తేది 05.03.2022 సాయంత్రం 5 గంటల వరకు పంపవలసిందిగా జిల్లా కలెక్టర్ తెలియజేసినారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరింబడవని తెలిపారు. అభ్యర్థి పుట్టిన తేది:01.06.2016 నుండి 31.05.2017 మధ్య కాలములో జన్మించి ఉండవలెను. పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం తప్పకుండా జాతపరచవలెనని లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయబడునని అన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నం.8639388553/ 990859848