ఇంట్లో ఆడపిల్ల ఉండడం అదృష్టం

Published: Friday July 08, 2022
 పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో జూలై 07 ప్రజా పాలన : ఇంట్లో ఆడపిల్ల ఉండడం అదృష్టం అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ వాస్తవ్యులు వేణు కూతురు కుమారి సింధు ఎంపిసి మొదటి సంవత్సరంలో జిల్లాలో మొదటి స్థానంలో, అదేవిదంగా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉత్తిర్ణత సాధించినందుకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద సుధాకర్ రెడ్డి తన నివాసంలో సింధూని మరియు వేణును సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని తల్లితండ్రులు గర్వపడేలా పేరు ప్రఖ్యాతలు సాధించేలా ముందుకు సాగాలని హితవు పలికారు.