రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం : అల్లూరి లోకేష్

Published: Friday July 02, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 01, ప్రజాపాలన : రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, రాజకీయాల అండతో రైతులపై భూస్వాములు దాడులు ఆపాలని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోకలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో గల ఆరెగూడెం గ్రామ రైతులకు, మోసం శివారులో దాదాపు 70 కుటుంబాలకు పట్టా దారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం 2018లో పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం కింద డబ్బులు రైతులకు అందుతున్నాయని, బ్యాంకుల నుండి పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, తీసుకుంటున్నారని అన్నారు. రైతులకు దాదాపు 1984 నుండి కొంత పట్టాలు కలిగి ఉన్నప్పటికీ స్వాములు రైతులపై దాడులు చేయడం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెరాస పార్టీ అండగా, భూస్వాములు రైతుల దగ్గర్నుంచి చట్టాలు రద్దు చేయించే ప్రయత్నాన్ని ఆపాలని సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో  గ్రామ రైతులు తిరుపతి, శ్రీనివాస్, జలపతి, శంకర్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.