ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజావాణికి 178 ధరఖాస్తులు

Published: Tuesday June 07, 2022
జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
 
  కరీంనగర్ జూన్ 6 ప్రజా పాలన ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్  ఆడిటోరియంలో  నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 178 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అత్యధికంగా  రెవెన్యూకు సంబంధించినవి 107, పంచాయతి శాఖకు చెందినవి 19, మున్సిపల్ కు చెందినవి 11,కాగా ఇతర శాఖలకు  సంబంధించినవి 41 ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను  ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు. 
 
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జెడ్పి సి.ఈ.ఓ ప్రియాంక, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఏ.డి, ల్యాండ్ అశోక్, ఎల్.డి.యం ఆంజనేయులు, షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్, డి.వై.ఎస్.ఓ రాజవీర్, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.