ఆరోగ్య వంతమైన పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Monday October 17, 2022

 బోనకల్, అక్టోబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోనే ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రతినెల జరిగే హెల్త్ ఇమేజెస్న్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో సర్పంచ్ మాట్లాడుతు సమావేశంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ప్రతినెల ఇచ్చేటువంటి టీకాలు క్రమం తప్పకుండ వేసుకొని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్ర, మంగళవారం లో జరిగే డ్రేడే ప్రేడే కార్యక్రమం ఆశ ,అంగన్వాడీలు చేసేటువంటి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు ప్రజల ఇంటి ఆవరణలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వారు చేస్తున్నటువంటి పరిశుభ్రత దోమల నివారణ చర్యలలో భాగంగా చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలని, వారి సూచనలు క్రమ తప్పకుండా పాటిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. గ్రామంలో పరిశుభ్రంగా ఉండేందుకు నివారణ చర్యలు చేపడుతున్నటువంటి కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఎటువంటి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధికి అందరూసహకరిస్తారని ప్రతి నెల శనివారం జరిగేటటువంటి గర్భిణీ బాలింతలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకునేందుకు ముందుకు రావాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ మర్రి తిరుపతిరావు తెలియజేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన చేతుల పరిశుభ్రతను ప్రతి రోజూ తినేముందు హ్యాండ్ వాచ్ చేసుకోవాలని, ఏలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి పరశురాం, ఆశా కార్యకర్తలు కళావతి, రత్తనకుమారి, అంగన్వాడి టీచర్లు పద్మ, హుస్సేన్ బీ, గౌరమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.