వత్రోత్సవ వేడుకల విజయవంతం కోసం కృషి చేయాలి.

Published: Thursday September 15, 2022
పాలేరు సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి
తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు గండు సతీష్ కోరారు.
మండల కేంద్రంలోని రైతు వేదిక లో మంగళవారం సన్మాహక సమావేశం ను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఈ నెల 16 న నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచి లో జరిగే ర్యాలీ కి పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని సూచించారు. గ్రామాల్లోకి వచ్చే వాహనాల ద్వారా ప్రజలను తరలించాలని సూచించారు. 17 న ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. హైద్రాబాద్ లో జరిగే సదస్సు కు మండలం నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులను తరలించాలని సూచించారు. 18 న జిల్లా కేంద్రంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతీ పంచాయతీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు "చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్యా, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, తహశీల్దార్ దారా ప్రసాద్, ఏవో నారాయణరావు, ఎంపీవో శివ, ఐకేపీ ఏపీయం ఆశోక్ రాణి, ఈజీఎస్ ఏపీవో సునీత,
 
సర్పంచ్ లు వల్లాల రాధాకృష్ణ, భూక్యా సుధాకర్, దండా పుల్లయ్య, ఈ వూరి సుజాత, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఐకేపీ సీసీ లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area