అంతర్జాతీయ నర్సు దినోత్సవ శుభాకాంక్షలు : ​గొల్లపల్లి మండల ఎంపీపీ నక్కశంకర్

Published: Thursday May 13, 2021
​గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సు సమాజ సేవకురాలు మే12 న జయంతిని ప్రపంచం ఆమెసేవకు గుర్తింపు గౌరవంగా నేడు ​అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల ఎంపీపీ నక్క శంకర్ నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ​ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని ఎంపీపీ కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని మనస్సుపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపారు.