మరగించి, కాచి చల్లర్చి, వడబోసిన నీటిని త్రాగడం శ్రేయాస్కారం. ...మండల వైద్యాదికారి ప్రసాద్ రావ

Published: Wednesday July 27, 2022
జన్నారం, జూలై 26, ప్రజాపాలన:
మరగించి, కాచి చల్లార్చి, వడబోసిన నీటిని త్రాగడం శ్రేయాస్కారమని మండల వైద్యాదికారి ప్రసాద్ రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లక్ష్మీపూర్ తండాలో సీజనల్ వ్యాదుల  నివారణ కోసం అరోగ్య వైద్య శిబిరం ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రోగులను పరీక్షించి మందులు గోలీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటి పరిసరాల అవరణలో నీటి నిల్వలు నుండకూడదని తెలిపారు. మురికి గుంట్టలు తీసివేయాలని , నీటి గుంట్టల వలన దోమలు ఈగలు తయారు అవుతాయన్నారు. వీటి వల్ల డెంగ్యూ, మాలేరియా, చికెన్ గున్యా వ్యాదుల వస్తాయని పేర్కొన్నారు. వీశా జ్వారాలు లక్షణాలు నున్నప్పుడు వేంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య చేయించుకోవాలని కోరారు. గిరిజన  గ్రామాలలో మూఢనమ్మకాలు నమ్మకుండా సొంత వైద్యాన్ని చేసుకోకుండా వైద్యుల సహకారంతో   వ్యాదులను నివారణ చేసుకోవాని తెలిపారు., అదేవిధంగా జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామపంచాయతి  కోత్తూరుపల్లి కాలానిలో పారిశుధ్య కార్యాక్రమం చేహించడమైందని ఎంపివో రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఖాలానిలో గేట్ వాల్ శుభ్రం చేయడం జరిగిందని, నీటి నిల్వలు ప్రదేశాలు గుర్తించి  అందులో పినాయిల్ వేయించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ తండా సర్పంచ్ నర్సింగరావు, ఉపాసర్పంచ్ శంకర్, వైద్య సిబ్బంది, రామ్ బాబు, సౌభాగ్య, పద్మ, బీంబాయ్, తదితరులు పాల్గొన్నారు.