మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ కిరణ్ బాబు..

Published: Thursday July 14, 2022
తల్లాడ, జులై 13 (ప్రజాపాలన న్యూస్):
 
 *తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో బుధవారం హరితహారంలో భాగంగా గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటికి ఆరు మొక్కలు చొప్పన అందించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కిరణ్ బాబు మాట్లాడుతూ మొక్కలను నాటటమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందునా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుకోవాలన్నారు. మొక్కల ద్వారానే  జీవరాశుల మనుగడ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.*
 
 
 
Attachments area