విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday September 07, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి) : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని  మేయర్  జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపద్యాయని, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో సుమారు 70 మంది టీచర్లను డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా సన్మానం చేసినారు. ఈ సమావేశంలో ఎంఈఓ శశిధర్, ప్రదనోపాధ్యాయులు సత్యప్రసాద్, సుశీల, రామయ్య, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బొడిగే స్వాతి, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్, తుంకుంట్ల ప్రసన్న లక్ష్మీ, పాశం శశిరేఖ, బండారు మంజుల, కుర్ర షాలిని, అలువాల సరిత, కౌడే పోచయ్య, పిట్టల మల్లేష్, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎన్.మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చెరుకు వరలక్ష్మి, షేక్ ఇర్ఫాన్, నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, లేతాకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, జావిద్ ఖాన్ గారు, ఉపద్యాయని ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.