ప్రభుత్వ కొనుగోలు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు --మార్కెట్ కమిటి చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్

Published: Wednesday November 09, 2022
చౌటుప్పల్, నవంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భముగా వారు మాట్లాడుతు రైతులు ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ రకమునకు రూ.2060/- కామన్ రూ.2040/- లు పొందవలెనంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యంను అమ్ముకొనగలరని తెలుపుతు ధాన్యంను వారి కళ్ళాల వద్దనే ఆరబెట్టి, చెత్త చెదారం లేకుండా శుభ్రముచేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగలరని తెలిపినారు. ఈ కార్యక్రమములో ఆర్.ఐ. కే.సుధాకర్, టి.ఆర్.యస్. నాయకులు ఊడుగు శ్రీనివాస్ గౌడ్ మరియు టి.ఆర్.యస్. యువజన నాయకులు బాలకృష్ణ, మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శి కే.ఉమామహేశ్వర్, సూపర్వైజర్స్ ఆర్.ఎల్లయ్య, సి.రాము, జే.యం.యస్.సి.హెచ్.బాబూరావు, హమాలీలు, చాటావాలీలు, దడవాయిలు మరియు రైతులు పాల్గొన్నారు,