కోనా నరసింహారావు ని సన్మానించిన బీజేపీ పట్టణ కమిటీ

Published: Wednesday April 27, 2022
మధిర ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు నరసింహారావుహ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన సదర్భంగా బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ కమిటీ నాయకులు మాట్లాడుతూ కోనా నరసింహారావు తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కార్యదర్శిగా ఎంపిక అయినందుకు అభినందించారు ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, రూరల్ మండల్ ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, సీనియర్ నాయకులు, సోమేశ్వరావు, పగడాల నాగేంద్రబాబు, గౌస్, ఖాజామియా, వెంకటేశ్వర తదితరులు పాల్గున్నారు,