మొక్కను నాటుదాం సంరక్షిద్దాం

Published: Friday August 26, 2022

16వ వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి   

కోరుట్ల, ఆగస్టు 25 (ప్రజాపాలన ప్రతినిధి):
మొక్కలు నాటి దాన్ని సంరక్షిద్దామని కోరుట్ల మున్సిపల్ 16వ వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి అన్నారు.గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారం లో భాగంగా ఎనిమిదవ హరితహారాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆదేశాలతో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య సూచనలతో 16వ వార్డులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటికి ఐదు చొప్పున పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరించిన అడవుల అభివృద్ధి కోసం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ఏడు విడతల్లో రాష్ట్రంలో కోట్లాది మొక్కలను నాటారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో లక్షలాది మొక్కలను నాటిపిచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి అందించే మొక్కలను ప్రతి ఒక్కరు నాటి వాటిని సంరక్షించాలని కోరారు .నేటి మొక్కలే రేపటి వృక్షాలు లాగా మారుతాయని తెలిపారు. తద్వారా గాలితోపాటు కాలుష్య నివారణ జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్పి పావని, మున్సిపల్ అధికారి సోహెల్, టిఆర్ఎస్ యూత్ పట్టణ ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సామల వేణుగోపాల్, చిట్యాల కర్ణాకర్, పసుల చిన్నయ్య, గురు మంతుల సత్తయ్య, ఉయ్యాల శేఖర్, మైస రాజేష్, అంగన్వాడి టీచర్లు ప్రభ, రత్నప్రభ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.