ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాల ఉచిత సేవలు ప్రారంభం

Published: Monday May 24, 2021

మంచిర్యల, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ తయారీ యంత్రాల ఉచిత సేవలను ఆదివారం డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా బాధితుల కోసం ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసే 10 యంత్రాలను కొనుగోలు చేసి సేవలను ప్రారంభిస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్ తివారి తెలిపారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిన కరోనా బాధితుల కోసం ఈ సేవలను ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని వైద్యుడు రమణ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ కొందరికీ అందడం లేదని అన్నారు. సాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని డిసిపి కొనియాడారు. ఈ కార్యక్రమంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రమణ, తదితరులు పాల్గొన్నారు.