పెరిగిన నిత్యావసర ధరలపై నిరసన ధర్నా..!!

Published: Saturday August 06, 2022
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు రాందాసు నాయక్ ఆధ్వర్యంలో*
 AICC మరియు టి *పి సి సి,టి సీఎల్పీ పిలుపు* మేరకు కేంద్రం లో రాష్ట్రంలో బీజేపీ మరియు టిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుటకు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపై నిరసన ధర్నాను నియోజకవర్గ. ప్రధానకేంద్రం వైరా కేంద్రంలోని. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిచి తహసీల్దార్ గార్కి మెమోరాండం అందజేశారు ఈసందర్బంగా వైరా ప్రధాన సెంటర్ నందు ధర్నా నిర్వహించారు అనంతరం ధర్నా నుద్దేసించి నియోజకవర్గ ఇంచార్జ్ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజలకు పూట గడవకుండా ఇబ్బందులకు గురించేస్తున్నారని. జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారులను. ఈఢీ పేరుతో ఇబ్బందులగు గురించేస్తే రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో. వైరా టౌన్ అధ్యక్షులు,ఎదునూరి సీతారాములు, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, మరియు వైరా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సీలం వెంకట నర్సిరెడ్డి, ఏన్కూర్ మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్, కారేపల్లి మండల అధ్యక్షులు, తలారి చంద్ర ప్రకాష్, జూలూరుపాడు మండల అధ్యక్షులు, మాలోత్ మంగీలాల్, ఏన్కూర్ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సిరిపురం ఎంపీటీసీ, మట్టూరి కృష్ణారావు, తిమ్మారావు పేట ఎంపీటీసీ లచ్చు నాయక్, సిద్ధి నగరం సర్పంచ్ కృష్ణారావు, పినపాక సర్పంచ్ వీరం రాజు, నాయకులు వేముల కృష్ణ ప్రసాద్, పాలేటి నరసింహారావు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..