కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వలు రైతు లపై కక్ష సాధింపు మానుకోవాలి : టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణ

Published: Friday October 08, 2021
కోరుట్ల, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏడాది కాలం గా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సత్యాగ్రహలు ధర్నాలు నిర్వహిస్తున్నారని వారికి మద్దత్తు గా ఉత్తరప్రదేశ్ లోని లఖమ్ పూర్ ఖేరిలో స్థానిక రైతులు ధర్నా నిర్వహిస్తే కేంద్రహోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మీశ్రకుమారుడు రైతు లపై నుండి వాహనం నడిపి నలుగురు రైతులమృతి కారకుడు అయ్యాడనితెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. గురువారం రోజున స్థానిక పత్రిక విలేకరులతో మాట్లాడుచు దేశంలో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించక పొగ కనీసం వారికి జీవించే జీవించే హక్కును కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని జువ్వాడి కృష్ణారావు అన్నారు. కేంద్ర మంత్రిని వెంటనే పదవి నుండి తప్పించాలని ఆయన కుమారున్ని వెంటనే అరెస్ట్ చేయాలనీ కృష్ణారావు డిమాండ్ చేశారుఇలాంటి ప్రభుత్వలకు పాలకులను త్వరలోనే ప్రజలు గద్దె దించే రోజులు వస్తాయని కృష్ణారావు హెచ్చరించారు.