యాచారం మండల కేంద్రంలో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ర్యాలీ సభలో

Published: Tuesday March 29, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : స్కీం వర్కర్లకు కనీస వేతనాలు 21 వేల రూపాయలు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల అంగన్వాడీ వర్కర్స్ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల కు నేటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26/- వేల రూపాయలు అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మదుసుధన్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి బస్ స్టాండ్ లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా సహయ కార్యదర్శి రాజ్యలక్ష్మీ. జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య.సర్పంచులు బాబయ్య. పెద్దయ్య. మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు. స్కీం వర్కర్లకు క్రింది స్థాయి అధికారులు దగ్గర్నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు అనేక ఆందోళనలు ధర్నాలు రూపంలో వినతిపత్రాలు సమర్పించిన వారికి న్యాయంగా రావాల్సిన ఎటువంటి కనీస వేతనాలు అమలు చేయడం లేదు అదేవిధంగా రాజకీయ వేధింపులు ఆపాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు తగ్గించడం చాలా దారుణం అన్నారు అదేవిధంగా జీవో తీసుకొచ్చి తొలగించడం సరైనది కాదు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు ఏడాదికి 200 రోజులు పనులు కల్పించాలి 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి 2020 సాగు బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం తీవ్రంగా వ్యతిరేకించారు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను వేగవంతం చేసి ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ఎల్ఐసి ఓడరేవులు స్టీల్ ప్లాంట్ విమానాలు అన్నిటినీ ప్రవేటీకరణ చేయటం వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు రు రు కాబట్టి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థ లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్ల రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం మెతకవైఖరి అవలంబిస్తున్నది గట్టిగా పార్లమెంట్లో నిలదీయడం లేదన్నారు సొంత ప్రయోజనాలు కోసం ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలులు రమణ. అండాలు. యాదమ్మ. కృష్ణయ్య. నర్సింహ్మ. రాములు జంగయ్య లక్ష్మయ్య ఎర్రం సోమయ్య. నర్సమ్మ. మైసమ్మ. పోచమ్మ. శాంతమ్మ. అరుణ. జంగయ్య. సాలమ్మ. లక్ష్మయ్య. సాయి కూమార్. చంద్రయ్య. వెంకటయ్య. ధర్మన్నగూడ. ఉప్పు సర్పంచ్ పాండు చారి. ప్రజాసంఘాల నాయకులు డివైఎఫ్ఐ మండల కన్వీనర్ చందు నాయక్, ఎస్ ఏఫ్ఐ జిల్లా నాయకులు జంగయ్య. ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్. వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సత్యం. రాజు, కోటయ్య. మల్లమ్మ. లలిత. బుజ్జమ్మ. సుగుణ. తదితరులు పాల్గొన్నారు