ఘనంగా బోనాల వేడుకలు

Published: Monday August 02, 2021

ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. మండలం లోని గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టయ్యపల్లి, అలీనగర్ లోని తెలంగాణ కాలనీలో సర్పంచ్ ప్రకాష్ చారి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసి, బోనాలు, ఒడి బియ్యలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వేణు, లక్ష్మయ్య, బాలయ్య, వీరేశం గౌడ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు