ఆర్టీసీ బస్సు డికొని యువతి మృతి

Published: Tuesday June 07, 2022
బెల్లంపల్లి , జూన్ 6,  ప్రజాపాలన ప్రతినిధి: ఆర్టిసి బస్సు ప్రమాదంలో బెల్లంపల్లి బస్టాండ్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో   ఉదయం చింతకింది భవాగ్నీ అనే కన్నాల బస్తీ కి చెందిన యువతి మృతి చెందిందిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీ కి చెందిన చింతకింది బావగ్ని అనే యువతి మంచిర్యాల శ్రీ వైష్ణవి డయాగ్నొస్టిక్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న యువతి విధులకు వెళ్తుండగా, మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ కు వెలుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా గా బస్సు నడిపి ,వెనుక నుండి ఢీకొనడంతో బావాగ్ని అక్కడికక్కడే, మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చింతకింది బావాగ్ని  ప్రతి రోజు లాగానే, ఉదయం ఏడు గంటలకు ఇంటిలో నుండి బయలుదేరిన  ఆమె, బస్టాండ్ మూలమలుపు వద్ద,  ఆమె దారిలో ఆమె వెళ్తుండగా, వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు నడపడం వల్ల ,  బావాగ్ని  పై నుండి వెళ్ళగా బావాగ్నీ అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయి ఉందని, డాక్టర్లు నిర్ధారించడంతో, ఆ తల్లిదండ్రులు కన్నీరు,మున్నీరుగా, విలపించటం స్థానికులకు కంటతడి పెట్టించింది,
చింతకింది వెంకటేసు, దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉండగా, వెంకటేష్ ,ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని సాకే వాడని, అతను ఇటీవల కిడ్నీలు పని చేయక, డయాలసిస్ జరుగుతున్న తరుణంలో, కుటుంబాన్ని పోషిస్తున్న, చేతికందిన కుమార్తె చింతకింది భావాగ్నీ బస్సు ప్రమాదంలో మృతి చెందడం కలకలం రేపింది.
విషయం తెలుసుకున్న స్థానిక వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్, సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, బావాగ్ని, అంత్యక్రియలకు తగిన సహాయ సహకారాలు అందించి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు తన అనుచరులు, జేఏసి సభ్యులు, అందరు ఉండి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూరం సంగీత భానేష్  మాట్లాడుతూ, నిరుపేదలైన చింతకింది వెంకటేశు దంపతులకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రైవేటు బస్సు యాజమాన్యం, ఇరువురు కలిసి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా  ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని, కుటుంబ సభ్యులు స్థానిక బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ఆందోళన నిర్వహించారు. వన్ టౌన్ సి ఐ రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబానికి అన్ని విధాల బస్సు యాజమాన్యంతో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. ఈ సంఘటనపై స్థానిక వన్టౌన్ పోలీసులు సి ఐ  ముస్కే రాజు, కేసు నమోదు చేసుకుని మృతికి కారణమైన  ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, వారి కుటుంబానికి  తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని,  హామీ ఇచ్చారు.