తెరాస ప్రజావ్యతిరేక విదానాలను, స్థానిక ఎమ్మెల్యే ఆగడాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి, ..కార్

Published: Friday June 24, 2022
బెల్లంపల్లి జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి: 
 
 తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను , బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న ఆగడాలను ప్రజల్లోకి తీసుకు పోయి పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ, వివేక్ వెంకటస్వామి అన్నారు.
గురువారం బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, భారత మాత, చిత్రపటాలకు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ తెరాస పార్టీ కార్యకర్తలకు అప్పనంగా పంచిపెడుతూ, కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ,ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎక్కడికక్కడ  బూ కబ్జాలకు పాల్పడుతూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, వీటన్నింటిని ప్రజలు నిలదీస్తే పోలీసులతో, పార్టీ కార్యకర్తలతో బిజెపి కార్యకర్తలను, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదని  ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటుందని, రాబోయేది బిజెపి, ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
 అనంతరం పార్టీలో చేరిన యువకులకు  కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు, జిల్లా ఇంచార్జ్ పల్లె గంగారెడ్డి,  ప్రధాన కార్యదర్శి ముని మంద రమేష్, పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్, వివిధ మోర్చాలకు చెందిన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.