కోవిడ్ బాధితులకు అండగా హరిప్రియమ్మ సేవా సమితి

Published: Wednesday May 26, 2021
కోవిడ్ బాధితులకు అండగా హరిప్రియమ్మ సేవా సమితి 
ఖమ్మం, 25 ప్రజాపాలన ప్రతినిధి : ఏజన్సీ నియోజకవర్గం అయిన ఇల్లెందు ఏరియాలో కోవిడ్ బాధితులకు హరిప్రియమ్మ సేవాసమితి బాసటగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పేరుతో టీఆరెస్ పార్టీ నేతలు. ముఖ్య కార్యకర్తలు  సంయుక్తంగా సేవా సమితి ఏర్పాటు చేసికోవిడ్ బాధితులకు  సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే అందించే ఆర్థిక సహకారం తో సేవా సమితి సభ్యులు  ఐసోలేషన్ లో ఉంటున్న కరోనా బాధితులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నార్తులకు రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారందరికి ప్రతి రోజు భోజన సదుపాయం కల్పించారు. వంటలు సిద్ధం చేస్తున్న బృందం కు ఎమ్మెల్యే హరిప్రియ సహకరిస్తున్నారు. బాధితులకు బోజనాలు అందించే కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. రాత్రుల్లో నిర్వహించే భోజన పంపిణి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు హరిప్రియ. హరిసింగ్ నాయక్ పాల్గొంటున్నారు. అమ్మలా అన్నార్తులకు రెండు పూటల భోజనం అందిస్తున్నతిరును బాదితులు ప్రశంశిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... ఆపదలో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టే వారిని నిజమైన ఆత్మీయులు అంటారు... కరోనా కష్టకాలంలో అమ్మలా ఆత్మీయతను పంచుతూ..... కమ్మని భోజనంతో ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ కడుపు నింపుతున్నారని కోవిడ్ బాధితులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే హరిప్రియ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కార్పోరేషన్లు మున్సిపాలిటీలోని పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్ స్ఫూర్తితో నియోజకవర్గ పరిధిలో కరోన బారినపడి చికిత్స నిమిత్తం ఐసోలేషన్ కేంద్రం లోని కరోనా బాధితుల ఆకలి తీర్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఖంభంపాటి రేణుకా మాట్లాడుతు  లాక్ డౌన్ వేళలో సుదూర ప్రాంతాల నుండి వచ్చి తమ వారికి భోజనాన్ని అందించే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను అవాంతరాలను గమనించిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో ఉంటున్న కరోనా బాధితులకు రెండు పూటలా ఉచిత  భోజనాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు అయిన ఎమ్మెల్యే హరిప్రియమ్మ సేవా సమితి పట్టణ కమిటీలో సభ్యులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, మేకల శ్యామ్, గుండా శ్రీకాంత్, పెండ్యాల హరికృష్ణ, మెరుగు కార్తీక్, గిన్నారపు రాజేష్, కుంట నవాబ్, సిరిమల్లె రాజు, నెమలి ధనలక్ష్మి, వున్నారు. మండలం కమిటీ లో సభ్యులుగా ఖమ్మంపాటి రేణుక, యలమద్ది రవి, దాస్యం ప్రమోద్ కుమార్, ఎస్కే గాజీ, పూనేo కమల, డేరంగుల పోషము, ఉరవకొండ ధనుంజయ్, నీలం రాజశేఖర్. బానోతు ధర్మ నాయక్,ఉన్నారు.