7వ డివిజన్ లో బోనాల పండుగ ఉత్సాహాలు

Published: Monday August 09, 2021
బాలాపూర్: ఆగస్టు 08, ప్రజాపాలన ప్రతినిధి : గుర్రం గూడా ప్రజలందరూ బోనాల ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నారని స్థానిక కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలోని ఏడో డివిజన్ కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ కాలనీ వాసులందరూ సంతోషంగా ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... అమ్మవారి కృప కటాక్ష తో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో  కార్పొరేషన్ ప్రజలందరూ, అదే విధంగా ముఖ్యంగా గుర్రం గూడా ప్రజలందరూ బోనాల ఉత్సవాలు, సంతోషంగా ఉండాలని స్థానిక కార్పొరేటర్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు యువకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.