మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ** సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా ** అద

Published: Wednesday December 07, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 6 (ప్రజాపాలన,ప్రతినిధి,సురేష్ చారి): మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం  కార్మికులకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం  సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ భగీరథ కార్మికులకు పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భగీరథ పథకంలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ జిల్లా వ్యాప్తంగా 600 మంది పంపు ఆపరేటర్స్, పిక్చర్స్, లైన్మెన్, తదితర కేటగిరిలలో వెనకబడిన వర్గాలకు చెందిన కార్మికులకు వేతనాలు లేక అలమదిస్తున్నారని అన్నారు. కార్మికుల త్యాగాల ఫలితంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రతి కార్మికునికి నెలనెలా ఫోన్ బిల్, పెట్రోల్ అలవెన్స్ రూ 5వేలు ఇవ్వాలని, సిఐటియు డిమాండ్ చేస్తున్న అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో భగీరథ కార్మికులు సురేష్, బాలేష్, లింగయ్య, ప్రభాకర్, రవీందర్.తదితరులు పాల్గొన్నారు.