అనాధలైన చిన్నారులను ఆదుకున్న బిజెపి నేతలు

Published: Thursday June 17, 2021
బాలపూర్, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలకు ఎప్పుడు ఆపదా వచ్చిన భాజపా నేతలు అండగా నిలుస్తారని రాష్ట్ర నాయకులు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బాలపూర్ గ్రామం నివాసులైన ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి వైరస్ నుండి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన తెలిసినదిని, అనాధలైన ఆర్రుర్ జయశ్రీ(13), యశ్వందర్ రెడ్డి(11) చిన్నారులకు బిజెపి రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి తో పాటు భాజపా శ్రేణులు కలిసి నగదు యాబ్బై ఐదు వేల రూపాయలు (55,000) నెల రోజులకు సరిపడే నిత్యవసర సరుకులు బుధవారం నాడు అందజేశారు. ఈ సందర్బంగా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ..... రంగారెడ్డి జిల్లాలోనే బాలాపూర్ కు చెందిన కుటుంబాన్ని కోల్పోవడం  చాల విచారకరమని, వారికి తీవ్ర సానుభూతిని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ తెలుపుతున్న మన్నారు. అనాధలైన పిల్లలకు బిజెపి కేంద్ర ప్రభుత్వం, అనాధలైన వారికి మంచి ఉన్నత విద్యాలయంలో ఉచిత విద్య, అదే విధంగా నెలకు సరిపోయే వారి ఖర్చులకు డబ్బులు, వారు మేజర్ అయిన తర్వాత 10 లక్షల రూపాయలు ఒక్కొకరి పేరుపైన  బ్యాంక్ లో డిపాజిట్ చేసి, భవిష్యత్తుకు వడ్డీ లేని రుణాలను వారికి అందజేయడం జరుగుతుందన్నారు. కరోనా తో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులందరికీ ఈ పథకాలు వర్తిస్తాయని అన్నారు. అలాగే నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఏ కుటుంబము నష్టపోవద్దాని సంకల్పంతో 21 జూన్ నుండి 18 సం లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిడ్ టీకాను దేశ ప్రజలందరికి ఇస్తున్నందుకు, ప్రధానికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు ఎపుడు ఆపదా వచ్చిన బిజెపి అండగా ఉంటుందన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు  కిసరి గోవర్దన్ రెడ్డి, భీమ్ రాజ్, సోమేశ్వర్, మల్లేష్, శూర్ణ కర్ణ రెడ్డి, జొరల ప్రభాకర్, శేఖర్ రెడ్డీ, మహేందర్ రెడ్డి, గుర్రం వంశీధర్ రెడ్డి, భాజపా శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.