లాక్ డౌన్ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు : రాయికల్ ఎస్సై జె.ఆరోగ్యం

Published: Thursday May 13, 2021
రాయికల్, మే 12(ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విధించిన లాక్ డౌన్ ని దృష్టిలో ఉంచుకొని రాయికల్ పట్టణ మరియు మండల ప్రజలకు, వ్యాపారస్తులకు కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే ప్రజలు తమయొక్క కార్యాక్రమాలు మరియు అవసరాలు ముగించుకోవాలని వ్యాపారస్తులు తమ యొక్క దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే ఓపెన్ చేసి ఉంచాలని, లాక్ డౌన్ నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడును. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా అనవసరంగా ఉదయం 10 గంటల తర్వాత బయటికి వస్తే వారిపైన కఠిన చర్యలు  తీసుకోబడునని రాయికల్ ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.