నవాంగి రైల్వేస్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాలి

Published: Tuesday August 03, 2021
లోక్ సభ సమావేశంలో ప్రస్తావించిన  చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 ఆగస్ట్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా బషీర్ బాద్ మండల కేంద్రంలోని నవాంగి స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. సోమవారం లోక్ స‌భ‌లో 377 నిబంధ‌న కింద ప్ర‌త్యేకంగా‌ ప్ర‌స్తావించిన చేవెళ్ళ ఎంపి. మండలంలోని 36 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వరుస రైళ్ల రాకపోకల మార్గం కావడంతో స్థానిక ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇతర మార్గాలు కూడా లేకపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ రహిత, సహిత రైల్వే గేట్లను తొలగించి అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని రైల్వే శాఖ విధాన పరమైన నిర్ణయం. కావున దయచేసి రైల్వే శాఖ మంత్రి నవాండ్జి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ ను నిర్మించి 36 గ్రామాల ప్రజలకు ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.