మధిర లోకలెక్టర్ పర్యటన

Published: Thursday September 23, 2021
మధిర, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ మధిర పట్టణంలో పర్యటించారు. ముందుగా యన్ ఎస్ పి గెస్ట్ హౌస్ లో సుమారు నాలుగు కోట్ల తో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ ను పరిశీలించారు. మధిర ట్యాంక్ బండ్ పెద్ద చెరువు ను పరిశీలించారు. మధిర ట్యాంక్ బండ్ చెరువు లో స్విమ్మింగ్ చేస్తున్న స్విమ్మింగ్ చేసే వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని స్విమ్మర్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం. సుమారు 6 కోట్లతో నిర్మించే మధిర ట్యాంక్ బండ్ చెరువును అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, చైర్మన్ కు సూచించిన జిల్లా కలెక్టర్. మధిర శివాలయం వద్ద ఉన్న స్మశానవాటిక ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. టివీఎం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. కలెక్టర్ పర్యటన సందర్భంగా సిపిఐ నాయకులు బెజవాడ రవి ఆధ్వర్యంలో మడుపల్లి లో ఉన్న డంపింగ్ యార్డును మార్చాలని వినతి పత్రం. ఆజాద్ రోడ్ లో ఉన్న పల్లపోతు ప్రసాదరావు తన నివాసం పక్కన ఉన్న సిమెంట్ గోడాంను మార్చాలని కలెక్టర్కు ఫిర్యాదు. కలెక్టర్ పర్యటన మధిర పర్యటనలో స్థానిక తాసిల్దార్ సైదులు ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి ఐబి ఇరిగేషన్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్, ఎం ఈ ఓ వై ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.