సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ...

Published: Monday June 07, 2021
జగిత్యాల, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 3,53,500 రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు భోగ ప్రవీణ్ ఆనంద్ రావు దుమాల రాజ్ కుమార్ కౌన్సిలర్లు కూసరి అనిల్ కూతురు రాజేష్ అల్లే గంగాసాగర్ ముస్కు నారాయణరెడ్డి నాయకులు అడువాల లక్ష్మణ్ సిరికొండ  రాజయ్య కూతురు శేఖర్ ముఖేష్ ఖన్నా కోటగిరి సుమన్ తదితరులు పాల్గొన్నారు.