పట్టణ సిపిఐ కార్యవర్గం ఎన్నిక

Published: Tuesday October 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది భారత కమ్యూనిస్టు పార్టీ మండల శాఖ మహాసభ మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో సోమవారం చొప్పరి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య లు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శి గా సల్వాద్రి రవీందర్, కార్యవర్గ సభ్యులుగా బలికె మొగులయ్య, చొప్పరి వెంకటేశం, బొడిగె సుదర్శన్, పారుపల్లి నరసింహ, మచ్చ లక్ష్మీనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.