రావినూతల అంగన్వాడీ కేంద్రాలలో బడిబాట, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొ

Published: Saturday June 11, 2022
బోనకల్, జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని బడి బాట కార్యక్రమంలో భాగంగా  అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని  ఏసిడిపిఓ కమల ప్రియ అన్నారు. శుక్రవారం రావినూతల గ్రామంలో 5 అంగన్వాడీ కేంద్రంలో జరిగిన బడిబాట కార్యక్రమంతో పాటు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ సి డి పి ఓ కమల ప్రియ, గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, హెల్త్ సూపర్వైజర్ దానయ్య మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి వారికి అందించే పౌష్టికాహారాన్ని వాళ్లు వచ్చి  తీసుకోవాల్సిందిగా కోరారు. 3 సంవత్సరాలు నుండి 5 సంవత్సరాలు వయస్సు ఉన్న పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో నిరంతరం పర్యవేక్షణ తో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా అంగన్ వాడి కేంద్రాలు పని చేస్తున్నాయని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఇక నుండి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. చక్కటి విద్యతోపాటు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆమె అన్నారు. అదే విధంగా పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం లో భాగంగా పలకలు బహూకరించి సర్పంచ్, ఏ సి డి పి ఓ, సూపర్వైజర్లు పలకలపై పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పి రమాదేవి, ఏఎన్ఎంలు సరోజ, కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు చేబ్రోలు ఉష, బి ఉష, బి శివ నాగేంద్ర, జి పార్వతి, టీ ఆలిస్, తల్లిదండ్రులు, గర్భిణిలు, బాలింతలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area