ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Published: Monday July 25, 2022

కోరుట్ల, జూలై 24 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆదివారం కోరుట్ల పట్టణంలోని 16వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక మొక్కలు నాటి, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు .అనంతరం బలిజ పద్మ రాజారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరు రాయరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రాన్ని ఐటి రంగంలో మరింత తీసుకెళ్లాలని కోరారు. కేటీఆర్ కాలుకు తగిలిన గాయం తొందరగా తగ్గి కోలుకోవాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి యాటం కృష్ణంరాజు, టిఆర్ఎస్ ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు సామల వేణుగోపాల్, చిట్యాల కరుణాకర్, టిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు బలిజ శివకుమార్, నాయకులు పసుల చిన్నయ్య, గోరుమంతుల సత్తయ్య కంబ ఆనంద్, చిట్యాల సాయికుమార్, మైస రాజేష్, చిట్యాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.