మధిర సేవాసమితి ఆధ్వర్యంలోబెస్ట్ కోవిడ్ వారియర్స్ కు ఘన సత్కారం

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మధిర సేవ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవo సందర్బంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ఉత్తమ మహిళా సేవకులను గుర్తించి మధిర సేవాసమితి ఆధ్వర్యంలో, సేవా పురస్కారాలను ప్రభుత్వ వైద్యశాల, మధిరలో గత జనతా కరఫ్యూ నుంచి ఇప్పటి వరకు బెస్ట్ కోవిడ్ వారియర్ గా సంపూర్ణ ఆరోగ్య సేవలు, స్థాయికిమించిఅందించినటువంటి మధిర పీపీ యూనిట్ సీనియర్ ఎఎన్ఎమ్ పంతంగి సంధ్య మరియు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ గరిగంటి. అనురాధకు మధిర సేవా సమితి నిర్వాహకుల చేతుల మీదుగా ఉత్తమ మహిళా సేవకుల అవార్డు ప్రధానం చేసారు. ఈ సందర్బంగా సంధ్య, అనురాధ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశాఖలో మేము చేస్తున్న ప్రజారోగ్య సేవలు గుర్తించి మాకు అవార్డు ప్రధానం చేయడం ఏంతో ఆనందంగా ఉందని మధిర సేవాసమితి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముందు ముందు ఎన్నో్నో కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మధిర సేవాసమితి నిర్వాహక కమిటీ అయినటువంటి శ్రీ పల్లబోతుల ప్రసాద రావు కి, ఎర్ర లక్ష్మణ్ రావు కి, చారుగుండ్ల లక్ష్మి నరసింహ రావు, కోమటిడి శ్రీనివాస్ రావు, మిరియాల కాశీ, డోకుపర్తి సత్యాంబాబు కి, ఇరుకుళ్ల. లక్ష్మి నర్సింహారావు, దేవిశెట్టి రంగారావు సన్మాన గ్రహీతలుకి ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయ పూర్వక తెలిపారు