నూతనకల్లులో పోడు సాగుదారుల గ్రామసభ..

Published: Saturday November 26, 2022

తల్లాడ, నవంబర్ 25 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనకల్లుతోపాటు చుట్టుపక్కల గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో పోడు సాగు చేసుకుంటున్నా వారిని గుర్తించి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సీతారాములు, సెక్రటరీ ఇజాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.