చనిపోయిన రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ప్రదర్శన

Published: Thursday October 07, 2021
హైదరాబాద్, అక్టోబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : ఉత్తరప్రదేశ్ లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన దీక్ష శిబిరంపై హోం శాఖ సహాయ మంత్రి ఆశిష్ మిశ్రా కొడుకు కారు కర్కశంగా దూసుకెళ్లి నలుగు రైతులను ఉద్యమకారులను బలి తీసుకున్నాడు. చనిపోయిన రైతులకు ఆత్మ శాంతి కలగాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ గీతా రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. చనిపోయిన బాధిత రైతు కుటుంబాలకు వెంటనే ఒక్కో కుటుంబానికి 2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించారు. అక్రమ అరెస్టులు బిజెపి నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రియాంక గాంధీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ, వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, సిటీ ప్రెసిడెంట్ మస్రత్, సికింద్రాబాద్ ప్రెసిడెంట్ ప్రభా, జనరల్ సెక్రెటరీ లక్ష్మి షబానా, శైలజ, ముంతాజ్, జెరీన మొదలగువారు పాల్గొన్నారు