అభివృద్ధిని అడ్డుకుంటే పరాభవం తప్పదు

Published: Wednesday November 17, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : అభివృద్ధిని చూసి ఓర్వలేక తమకు రాజకీయ భవిష్యత్తు కనుమరుగయ్యిందన్న అక్కసుతో లేనిపోని దరఖాస్తులు పెట్టి సాఫీగా సాగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతో గతంలో ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన వివిధ పార్టీల సభ్యులు  కలసి టీఆర్ ఎస్ ఉపసర్పంచ్ బూడిద నరసింహ్మా రెడ్డి పైన పెట్టిన అవిశ్వాసంపై ఆయన హైకోర్టుకు వెళ్లగా ఆవిశ్వాసాన్ని నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గా బూడిద నరసింహ్మా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆశీర్వాదంతో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు దండేకార్ జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎం డి మునీర్ సూచనలతో హైకోర్టుకు వెళ్లినందువల్ల న్యాయస్థానం విచారించి అవిశ్వాసం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఉప్పరిగూడ గ్రామ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పరాభవం తప్పదని ఉపసర్పంచ్ నరసింహ్మా రెడ్డి అన్నారు.